Friday, March 20, 2026

*వైద్య.. పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే.. కోటి సంతకాల సేకరణ : ఇన్చార్జ్ కృపా లక్ష్మి*

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*గంగాధర నెల్లూరు*జీడి నెల్లూరు మండల కేంద్రంలో వైసీపీ కోటి సంతకాల సేకరణను ఇంచార్జ్ కృపా లక్ష్మి ఆధ్వర్యంలో వైసీపీ దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. వైసీపీ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం డా. అంబేద్కర్, డా. వైయస్సార్ విగ్రహాలకు పూలమాలవేసి ఘన నివాళి అర్పించి విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా *జీడి నెల్లూరు ఇంచార్జ్ కృపా లక్ష్మి* మాట్లాడుతూ..పేద వైద్య విద్యార్థుల బంగారు భవిష్యత్తును గుర్తించి కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణను ఆపడానికే.. మా జగనన్న ఈ యజ్ఞాన్ని చేపట్టారన్నారు. వైద్యాన్ని ఎలాగూ ఇవ్వరు కాబట్టి విద్యనన్నా.. పేద వైద్య విద్యార్థులకు ప్రైవేటీకరణను మానుకొని కూటమి ప్రభుత్వం ఉచితంగా అందించాలన్నదే.. మా జగనన్న ఏకైక లక్ష్యం అన్నారు. వైద్యులు దేవుడితో సమానం కాబట్టి వైద్య విద్యార్థులకు ఈ ప్రయత్నంలో మా మాజీ సీఎం, మా అధినేత జగన్ అన్న దైవం స్థానంలో ఉన్నారని కొనియాడారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయకుండా.. చేయాలని ఆమె డిమాండ్ చేశారు.ఈ మహా యజ్ఞానికి సహకరించిన ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులకు చేతులు జోడించి ఆమె కృతజ్ఞతలు తెలిపారు *మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి* మాట్లాడుతూ..కుల, మత, పార్టీలకతీతంగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం చేస్తున్న మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు చేసి మా అధినేత జగన్ అన్నకు అండగా నిలిచారన్నారు. మా జగనన్న చేస్తున్న ప్రయత్నానికి మీడియా వారు సైతం అతీతంగా సహకరించాలని కోరారు.గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి పార్టీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. లేకుంటే పార్టీకి మరో మారు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సూచించారు. *రాష్ట్ర కార్యదర్శి మహాసముద్రం దయాకర్ రెడ్డి* మాట్లాడుతూ..మానవాళికి విద్య, వైద్యం ప్రాథమిక అవసరాలని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం పప్పు, బెల్లానికే వైద్య కళాశాలలను తాకట్టు పెట్టారని, ఈ మా కోటి సంతకాల ప్రయత్నం ఢిల్లీని తలదన్నేలా సహకరించిన ప్రతి ఒక్క వైసీపీ కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటామన్నారు. *జీడి నెల్లూరు పరిశీలకులు పృధ్విరాజ్* మాట్లాడుతూ..జీడి నెల్లూరు ఇన్చార్జ్ కృపా లక్ష్మిపై మా అధినేత జగనన్న పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా కోటి సంతకాల సేకరణకు పూర్తిగా సహకరించి 1.5% శాతం ఇంకా అధికంగా పూర్తి చేయడానికి కృషి చేస్తారని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని 6 మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాను చేత పట్టుకుని.. జై జగన్, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ.. తమ హర్షాన్ని వ్యక్తం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News