నేటి సాక్షి, కామారెడ్డి: మెడికల్ కాలేజీ హాస్టల్ ఫీజు, పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్న సంజనకు హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున ఆర్థిక సాయం చేశారు. తండ్రి అనారోగ్యం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయని కామారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తున్న సంజన తన హాస్టల్, పరీక్ష ఫీజు కోసం సాయం చేయాలని కోరగా, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ స్పందించారు. హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ తరపున ఆదివారం కామారెడ్డిలో ఆ విద్యార్థినికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని చెక్ రూపంలో అందించారు. అవసరం ఉన్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ హెల్పింగ్ హాండ్స్ అసోసియేషన్ వారికి సంజన కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో తాను కూడా హెల్పింగ్ హాండ్స్ సంఘం ఆశయాన్ని ముందుకు తీసుకొనివెళ్తానని పేర్కొన్నది. వారి వెంట ఉపాధ్యాయ నాయకులు కే వెంకట్ తదితరులు ఉన్నారు.