నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి( గుండ ప్రశాంత్ గౌడ్ ):వెల్గటూర్ మండల కేంద్రంలో మధ్యాహ్నం 02 గంటల సమయంలో ఎండపల్లి గ్రామానికి చెందిన బొడ్డు రాజేష్, సబ్బు రాజేష్ మరియు వాసు (ఎండపల్లి) అనువారు ముగ్గురు ఎండపల్లి లోని మహాలక్ష్మి వైన్స్ కి వచ్చి మద్యం కొనుగోలు చేయగా వైన్స్ యజమాన్యం పెరిగిన ధరలకు అనుగుణంగా మద్యం అమ్మడం జరిగింది, వారు గొడవ చేయాలనే ఉద్దేశంతో మద్యం అధిక ధరలకు మీరు ఎలా అమ్ముతారు, అని వైన్స్ యాజమాన్యం పై దౌర్జన్యం చేసి గొడవ చేయాగ , వైన్స్ యాజమాన్యం వారు ప్రభుత్వం నిర్ణయం ప్రకారం మేము అమ్ముతున్నమని అని చెప్పిన వినకుండా వైన్స్ లోకి అక్రమంగా ప్రవేశించి, వైన్స్ నిర్వహకులను లోపల నిర్బంధించి, బయట నుండి షటరు క్లోజ్ చేసి బూతులు తిడుతూ, చంపుతా అని బెదిరించారు, వైన్స్ నిర్వాహకుడు గట్టా పల్లి శ్రీరామ్ ఫిర్యాదు మేరకు ముగ్గరు పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనైనది అని ఎస్ ఐ ఉమా సాగర్ తెలిపారు