నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలోని శ్రీ శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయంలో Sr జాతర సందర్భంగా మల్లన్న పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది.*భక్తుల నడుమ పల్లకీ ఊరేగింపు*ఉత్సవమూర్తిని పూలతో అలంకరించిన పల్లకీలో ప్రతిష్ఠించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య పట్టణ ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. ‘హర హర మల్లన్న’ నినాదాలతో భక్తులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.*భక్తి పారవశ్యంలో కోరుట్ల*జాతర సందర్బంగా ఆలయ పరిసరాల్లో విద్యుత్ దీపాలతో అలంకరణలు చేపట్టారు. భక్తులకు తాగునీరు, ప్రసాదాల పంపిణీ వంటి ఏర్పాట్లు నిర్వహించారు. పట్టణ ప్రజలతో పాటు పరిసర గ్రామాల నుండి కూడా భక్తులు తరలివచ్చి పల్లకీ సేవను వీక్షించారు. కార్యక్రమం భక్తి భావంతో, శాంతియుత వాతావరణంలో కొనసాగింది._________





