– భక్త జనసంద్రంగా మారిన దేవస్థానం…-భక్తులకు అన్ని ఏర్పాట్లు సూపర్….!! -పాల్గొన్న ఎమ్మెల్యే బిఎల్ఆర్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్నేటిసాక్షి, మిర్యాలగూడ : భక్తుల పాలిట కల్పవల్లిగా విరాజిల్లుతున్న “శ్రీ కల్లేపల్లి బంగారు మైసమ్మ తల్లి” మహా జాతర శనివారం రాత్రి అంగరంగ వైభవంగ ప్రారంభమయ్యాయని ఆలయ చైర్మన్ ధీరావత్ దస్రు నాయక్ తెలిపారు. నియోజకవర్గ పరిధిలోని దామచర్ల మండలం కల్లేపల్లి గ్రామంలో కొలువైన శ్రీ కల్లేపల్లి బంగారు మైసమ్మ తల్లి మూడు రోజుల జాతరలో భాగంగా, భక్తులు అధిక సంఖ్యలో దర్శనాలు చేసుకుంటున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ దస్రూ నాయక్, ఆలయ ఈవో గుజ్జల కొండల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆదివారం తెల్లవారుఝామున 5 గంటలకు అమ్మవారిణి అభిపికము తదుపరి అలంకరణ అనంతరము మహానివేదన నీరాజన మంత్ర పుష్పములు తీర్ధ ప్రసాద వినియోగము జరిగినదన్నారు. శనివారం సాయంత్రము 4 గంటలకు కల్లెపల్లి గ్రామము నుండి శ్రీ అమ్మవారిని ఆలయ వంశస్థులు ఊరేగింపుగా డప్పు, వాయిద్యాలతో, మేళతాళాలతో కోలాటాలతో ఊరేగింపుగా దేవాలయమునకు తీసుకొని, వచ్చారన్నారు. ఈసందర్భముగా భక్తులకు ఎటువంటి తాజా కలుగకుండా ఆలయ కమిటీ అధ్యక్షులు ధీరావత్ దస్రూ నాయక్, కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి ఆధ్వర్యములో ఏర్పాట్లు అన్ని కల్పించారు. రాత్రి 7 గంటలకు శ్రీ అమ్మవారి శాంతి కళ్యాణము వైభవముగా జరిగిందని తెలిపారు. ఈ జాతర ఉత్సవాలలో భాగంగా మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్ మాలెంపాటి, శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, రాష్ట్ర నాయకులు, అమ్మవారి వంశస్థుడు ధీరావత్ స్కైలాబ్ నాయక్ స్కైలాబ్ నాయక్, డిఎస్పీ రాజశేఖర్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. అనంతరం కమిటీ ఈఓ వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. ఈ జాతరలో మిర్యాలగూడ డిఎస్పీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో మిర్యాలగూడ రూరల్ సిఐ పిఎన్ ప్రసాద్, వాడపల్లి యస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ట్రాఫిక్ నియంత్రణలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమములో కల్లేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మాలోతు జనార్ధన్ నాయక్, పాచ్చు నాయక్ నెహ్రూ నాయక్, లింగా నాయక్, భాష్య నాయక్, ఆలయ పూజారులు అమ్మవారి వంశస్థులు డి వెంకటేశ్వర్లు, రామ్మోహన్, కోటేష్, బహదూర్ మరియు గ్రామ పెద్దలు ఎర్ర నాయక్, హజ్మీర లింగా నాయక్, మేఘ, వాగ్య, ధీరావత్ లింగ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు, మరియు భక్తులు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.