నేటి సాక్షి,నారాయణపేట, జనవరి 31, రిపోర్టర్ ఇమామ్), నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలోని రైచూర్ వెళ్లే రహదారిలో వెలిసిన శ్రీ శ్రీ కన్యకా పరమేశ్వరి దేవత మహోత్సవాల్లో భాగంగా శనివారం నాడు ఆర్యవైశ్యుల సంఘం సభ్యులు మహిళలు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమాలను సంఘం అధ్యక్షులు వెంకటేష్ శెట్టి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి మరికల్ పట్టణ ఆర్యవైశ్యుల మహిళల అధ్వానంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరికల్ దేవాలయ కమిటీ సభ్యులు, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు.





