నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి మార్చి 12మన మండలం కేంద్రంలో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.దివంగత మహానేత *డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి* గారి విగ్రహనికి పూలమాలలు వేసి, పార్టీ జెండాను ఎగరవేసి ఆయన ఆశయాలను మరోసారి స్మరించుకోవడం జరిగినది.పేద ప్రజల సంక్షేమం కోసం మహానేత చూపిన మార్గంలో మన పార్టీని ముందుకు తీసుకుపోతున్న మాజీ ముఖ్యమంత్రివర్యులు *శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి* గారికి, మాజీ మంత్రివర్యులు *శ్రీ డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి* గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు *శ్రీ పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డి* గారికి అభినందనలు తెలియజేస్తున్నాము.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తూ… భవిష్యత్తులో కూడా పార్టీ బలోపేతానికి మీ అందరి సహయ సహకారాలు ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాము.




