నేటి సాక్షి, అన్నమయ్య జిల్లా, శర్మ, డిసెంబర్ 17 ~అన్నమయ్య జిల్లా :-: తాడేపల్లి లోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గ పరిధిలోని బొల్లాపల్లి జడ్పీటీసీ రమావతు భీమి బాయి, బంజారా సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణా నాయక్ ఆయన కుమారుడు అనిల్ కుమార్ నాయక్, కోడలు విజయలక్ష్మి లు కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ రమావతు భీమి బాయి, బంజారా సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణా నాయక్ కోరిక మేరకు ఆయన మనువడి కి వైయస్ జగన్ చేతుల మీదగా అన్నప్రాసన కార్యక్రమం తో పాటు నామకరణం చేయించాలని ఎప్పటినుంచో భావిస్తున్నారు. వాళ్ళ కళ ఎట్టకేలకు బుధవారం నాడు సాకారమైంది. బుధవారం జడ్పీటీసీ కుటుంబ సభ్యులు ఏకమై వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ నుండి నేరుగా వైయస్ జగన్ కార్యాలయం వద్దకు వెళ్లి జగన్ కు వివరించారు. జడ్పీటీసీ గా చెప్పారు. అంతలోనే బుడ్డోడిని చూసిన వైయస్ జగన్ వారి వద్ద నుంచి బుడ్డోడిని అందుకున్నారు. ఆ పిల్లాడు జగన్ ఎత్తుకున్నంతసేపు ఆయన వైపే చూస్తూ ముసి ముసి నవ్వులతో హుషారుగా గెంతు లేసాడు. అనంతరం కుటుంబ సభ్యులకు కోరిక మేరకు అన్నప్రాసన మరియు నామకరణం చేయాలని కోరారు. చంటి బుడ్డోడిని లాలించి వారిని అడిగి విచారించి ప్రజ్వల్ కృష్ణ రాథోడ్ గా నామకరణం చేసి చంటి పిల్లాడికి ఆశీస్సులు అందించాడు. ఈ మేరకు చంటి పిల్లాడు తాత, నానమ్మ హర్షం వ్యక్తం చేస్తూ తమ మనవడికి వైయస్ జగన్ చేతుల మీదుగా అన్నప్రాసన, నామకరణం జరిగినందుకు ఎంతో సంతోషిస్తున్నామని ఆయన చేతుల మీదగా కార్యక్రమాలను చేయించాలనుకున్నామని ఇంత దూరం నుంచి వచ్చినందుకు మా కళ సాకారమైంది. జగన్ లా మురిపెంగా ఎత్తుకొని లాలించి మా మనవడికి పేరు పెట్టినందుకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని ఆ పిల్లాడిని పిలిచినప్పుడు అంత జగన్ గుర్తుకొస్తారని అన్నారు..~~~~~~~~~~~~~~~~~~





