Sunday, March 15, 2026

వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి పూర్తి ప్రణాళిక సిద్ధం చేయాలి.—- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్…

నేటి సాక్షి,నారాయణపేట, నవంబర్ 1,జిల్లాలో వ్యవసాయ అనుబంధాల రంగాల అభివృద్ధికి పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి పీఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం అమలు పై వ్యవసాయ, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ, హార్టికల్చర్, మత్స్య శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఆయా రంగాల ఉత్పాదకతలను పెంచేలా అన్ని పారామిటర్స్ కూడిన డాక్యుమెంటేషన్ కు అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. జిల్లాలో ఆ పథకం అమలు కోసం మన జిల్లాకు కేంద్రం నుంచి ఓ ప్రత్యేక ( ఐ ఏ ఎస్)అధికారి వస్తున్నారని, అందరూ తమ తమ శాఖల పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమీక్షలో ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ శ్రీరామ్ ప్రణీత్, అధికారులు సాయిబాబా,జాన్ సుధాకర్, రహమాన్, ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News