Saturday, March 21, 2026

వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలానికి భద్రత ఏర్పాట్లు..!భూ కబ్జాదారుల నుండి భూ – సంరక్షణ కొరకు సర్వే నిర్వహించి గట్టి భద్రత.. సెక్రటరీ నవీన్ కుమార్ రెడ్డి

నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 09 ~అన్నమయ్య జిల్లా :-: స్థానిక నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు మండల కేంద్రమైన స్థానిక మదనపల్లి రోడ్డులో గల ఎన్ హెచ్ 42 జాతీయ రహదారి కి కూత వేటు దూరంలో గ్రామ సచివాలయం పక్కన వున్న ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన ఎకరాలు 2.79 సెంట్లు గల భూమి రక్షణ కొరకు మంగళవారం వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులు సెక్రటరీ నవీన్ కుమార్ రెడ్డి పరవేక్షణలో సభ్యులు బాలాజీ నరసింహారాజు, రహీం, సునీల్ వీరంతా ఏకమై సర్వేయర్ ద్వారా భూ సర్వే నిర్వహించి గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సెక్రెటరీ నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ భూ కబ్జాదారుల నుండి అక్రమణాలకు గురికాకుండా వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థలాన్ని సర్వే నిర్వహించి భద్రత ఏర్పాట్లు చేయాలని పై అధికారులు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడికి వెళ్లి సర్వే నిర్వహించి భద్రత ఏర్పాట్లు చేశామని ఎలాంటి ఆక్రమణలకు మరియు భూకబ్జాదారుల నుండి కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు..~~~~~~~~~~~~~~~~~

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News