ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విద్యాలయ శాస్త్రవేత్తలు – గుమ్మడిదల ,జూన్ 4 నేటి సాక్షి న్యూస్ ;వ్యవసాయ సాగు విత్తనాలను ప్రభుత్వ రంగ సంస్థల నుండి కొనుగోలు చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తెలిపారు . ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేపట్టిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమం బుధవారం గుమ్మడిదల మండలం రాంరెడ్డి బావి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బి హేమలత మాట్లాడుతూ, రైతులు విత్తనాలు, పురుగుమందులు కొనుగోలు చేసినప్పుడు తీసుకునె బిల్లులు సీజన్ ముగిసే వరకు భద్రంగా ఉంచుకోవాలని సూచించారు. సాగు వ్యయాన్ని తగ్గించుకునే మార్గాలను రైతులకు వివరించారు.విత్తనాలను ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా గాని, విశ్వవిద్యాలయం ద్వారా గాని కొనుగోలు చేయాలని తెలిపారు. కొత్త రకపు వరి రకాలపై రైతులకు అవగాహన కల్పించారు. మొక్కజొన్న పంటలో పాల్ ఆర్మీ వార్మ్ నివారణ ,అడవి పందుల నిర్వహణ చర్యల గురించి రైతులకు శాస్త్రీయంగా వివరించారు. విత్తన శుద్ధికరణ లో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. రైతులు సమతూలిత ఆహారం తీసుకోవాలని వారు కోరారు. రోజువారి ఆహారంలో ప్రోటీన్లు, ఫైబర్ ప్రాముఖ్యతను వివరిస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యమని వారన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి ప్రణవి, యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి హీమా కుమార్, డాక్టర్ సారిక, సుస్మిత ,గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

