( నేటి సాక్షి): శంకర్పల్లి మండల మున్సిపల్ పరిధిలోని ప్రయాణికుల సౌకర్యం కొరకు మూడు ఎక్స్ ప్రెస్ (పర్భని, రాయచూర్, విజయపుర) రైళ్ళను రైల్వే అధికారులు నిలపడం సంతోషకరమని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శంకర్పల్లి రైల్వే స్టేషన్ లో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో కలిసి పర్భని ఎక్స్ ప్రెస్ ను నిలుపుదలను ఎంపీ ప్రారంభించారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అదే రైలులో నగరానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గతంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శంకర్పల్లికి వచ్చిన సందర్భంలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మూడు రైళ్ళను ఇక్కడ నిలిపేందుకు అధికారులు సానుకూలంగా స్పందించారు. రైళ్ళను నిలపడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా రైల్వే శాఖ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ రైల్వే స్టేషన్ల ఆధునీకీకరణ అండర్ పాస్ రైల్వే వంతెనలు నిర్మాణాలు చేపట్టడానికి నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. శంకర్పల్లి రైల్వే స్టేషన్ లో మూడు ఎక్స్ ప్రెస్ రైళ్లు నిలపడంతో ప్రయాణికులకు ఎంతో మేలు చేసినట్లు అయిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు చందిప్ప దయాకర్ రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు వాసుదేవ్ కన్నా, శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, సురేష్, రామ్మోహన్, విశ్వనాథ్, విఠోబా, వార్డు సభ్యుడు నందు, వెంకటేష్, పాండురంగం, శ్రీకాంత్ రెడ్డి, లోకేష్, పండిత్ రావు గౌడ్, రాజేష్ గౌడ్, చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్ రవీందర్, కమర్షియల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి, స్టేషన్ మేనేజర్ మోహన్ రావు పాల్గొన్నారు.





