Wednesday, March 18, 2026

శంకర్పల్లి మండలం మోకిలా గ్రామంలో అయ్యప్ప మహా పడిపూజ ఘనంగా

నేటి సాక్షి ప్రతినిధి సుధాకర్ గౌడ్ శంకర్పల్లి న్యూస్ శంకర్పల్లి మండలంలోని మోకిలా గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వడ్డే లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఈ రోజు అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు.మోకిలా గ్రామ ప్రజలు మరియు అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.భజన మండలి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం అయ్యప్ప భక్తి గీతాలతో మారుమోగి, ఆ ప్రాంతం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది.ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు, యువత, అయ్యప్ప మాలధారులు కలిసి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమం విజయవంతం కావడంలో సహకరించిన అందరికీ వడ్డే లక్ష్మయ్య గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News