రామచంద్రాపురం
మండలంలోని రాయలచెరువు వద్ద వెలసిన శ్రీ శక్తి పీఠంలో శ్రీ వారాహీ దేవి నవరాత్రుల ఉత్సవాలు
మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతాజీ రమ్యానందభారతీ స్వామినీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవముగా జరుగుతున్నాయి.
అందులో భాగంగా గురువారం ఉదయం పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలతో పాటు శ్రీ కిరాత వారాహీ దేవి మంత్ర హోమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్ పర్సన్ సుగుణమ్మ పీఠాన్ని సందర్శించి దేవతలకు మ్రొక్కులు తీర్చుకున్నారు.
అనంతరం పరమ పూజ స్వామి వారి మరియు పూజ మాతాజీ వారి ఆశీస్సులు పొందారు.
అనంతరం బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ శ్రీ పాతాళ శ్వేత వారాహీ దేవికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పరమపూజ్య శ్రీ స్వామివారి, పూజ్య శ్రీ మాతాజీ వారి ఆశీస్సులు పొందారు. పీఠ ప్రధాన కార్య నిర్వహణాధికారి వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి పీఠ ప్రసాదాలను అందించారు
సాయంత్రం కళాకారులచే గాన కచేరి, జగద్గురువుల దివ్య సమక్షంలో పూజ్యశ్రీ మాతాజీ వారిచే శ్రీ పాతాళ శ్వేత వారాహీ దేవికి దర్బారు సేవా నిర్వహించారు.
ఏడవ రోజు గురువారం దేశ విదేశాల నుండి సుమారు 10.000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు