నేటి సాక్షి ప్రతినిధి / డిసెంబర్ 16 చేవెళ్ల న్యూస్ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని కమ్మేట గ్రామంలో మంగళవారం నాడు అయ్యప్ప మహా పడిపూజ జరిగింది ఇట్టి పూజ ఉదయము ఆరు గంటలకు స్వాములు ఇరుముడులు కట్టుకొని అయ్యప్ప స్వామిని భక్తిశ్రద్ధలతో పూజ చేసినారు ఇట్టి పూజ శేఖర్ గురుస్వామి ఆధ్వర్యంలో జరిగింది స్వాముల కోలాటంతో భజన పాటలతో గ్రామంలో అయ్యప్ప స్వాములు రాకతో గ్రామ నలుమూలలో అయ్యప్ప నామస్వరముతో మారుమోగింది స్వాములు పెద్ద సంఖ్యలో వచ్చి అయ్యప్ప స్వామి పూజలో భజన పాటలు పాల్గొని గ్రామ ప్రజలు ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు గ్రామ పెద్దలు మరియు యువకులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొని స్వాములందరూ శబరిమలకు 6 గంటలకు బయలుదేరేవరకు గ్రామ ప్రజలు ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఊరి పెద్దలు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి సేవలో కృప పాత్రులై అయ్యప్ప స్వాములు ఆశీర్వాదం తీసుకున్నారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మొత్తము పాల్గొని అయ్యప్ప స్వాములు పూజను విజయవంతం చేసినారు వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలకు అయ్యప్ప స్వాములు కృతజ్ఞతలు తెలిపినారు





