Thursday, March 12, 2026

శరీరం–మనసు సమతుల్యతే నిజమైన ఆరోగ్యం

నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, అక్టోబర్ 15: ది అపోలో యూనివర్శిటీ యోగా అండ్ మెడిటేషన్ క్లబ్‌ ఆధ్వర్యంలో “వరల్డ్ మెంటల్ హెల్త్ డే” సందర్భంగా బుధవారం “ఆబ్జర్వెన్స్ డే” కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్‌ సేతురామ సుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, మానసిక ప్రశాంతత, మంచి అలవాట్లు, సమతుల ఆలోచనలు మన ఆరోగ్యానికి మూలస్తంభాలు అని చెప్పారు.రిసోర్స్ పర్సన్‌, హార్ట్‌ఫుల్‌నెస్‌ మెడిటేషన్‌ ఫెసిలిటేటర్‌, సీటామ్స్‌ అసోసియేట్ ప్రొఫెసర్‌ హంసవేణి యోగా, ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను మరియు శరీరం–మనసు సమతుల్యతను ఎలా సాధించవచ్చో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ, నేటి వేగవంతమైన జీవనశైలిలో యోగా, ధ్యానం వంటి సాధనాలు మానసిక ఆరోగ్యానికి అత్యంత అవసరమని, ప్రతిరోజూ కొన్ని నిమిషాల ధ్యానం ద్వారా ఒత్తిడి, ఆందోళనల నుండి బయటపడవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో యోగా అండ్ మెడిటేషన్‌ క్లబ్‌ ఫ్యాకల్టీ కో-ఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ డీన్‌ డాక్టర్‌ కవిత ఎస్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రెస్‌ అండ్ పబ్లికేషన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కీర్తనా థాంకచన్‌, విద్యార్థులు, అధ్యాపకులు, యోగా క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News