చందుర్తి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రమేష్. నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి(సతీష్): శాంతి భద్రతలో పరిరక్షణలో మండలం లోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బుధవారం రోజున చందుర్తి ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన జిల్లెల్ల రమేష్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశానుసారం చందుర్తి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో చందుర్తి ఎస్సైగా బాధ్యతలు చేపట్టినట్లు ఈ స్టేషన్లో రెండవసారి ఎస్సైగా విధులలో చేరినట్లు ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మండల ప్రజలు సహకరించాలని ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరుసహకరించాలని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది ఉన్నారు.

