Friday, March 20, 2026

శాంతి భద్రతల పరిరక్షణకు మక్తల్ లో పోలీసుల మాక్ డ్రిల్ నారాయణపేట అదనపు ఎస్పీ ఎండి రియాజ్ హూల్ హాక్…..ప్రజల భద్రత, తక్షణ స్పందన కోసం, మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహణ…..

నేటి సాక్షి నారాయణపేట నవంబర్ 27,నారాయణపేట జిల్లా:జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ మరియు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు *మక్తల్ పట్టణ కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మైదానంలో మక్తల్ పోలీసులు, ప్రత్యేక సాయుధ బలగాలు కలిసి విస్తృత స్థాయిలో మాబ్ ఆపరేషన్ మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది అని అదనపు ఎస్పీ ఎండీ రియాజ్ హూల్ హక్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, పోలీసు సిబ్బందికి మాబ్ కంట్రోల్‌లో అనుసరించాల్సిన విధానాలు, కార్యాచరణ ప్రణాళికలు, గందరగోళ లేదా అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు తక్షణ స్పందన సామర్థ్యం, ప్రజల ప్రాణ రక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై శిక్షణ ఇవ్వబడిందని ఆయన పేర్కొన్నారు. మాక్ డ్రిల్‌లో భాగంగా ఫుట్ ఫార్మేషన్, టీమ్ కోఆర్డినేషన్,హెచ్చరిక విధానాలు,చట్టపరమైన చర్యల అమలు పద్ధతులు వంటి అంశాలను సిబ్బంది ప్రాక్టికల్‌గా ప్రదర్శించారు. ఈ శిక్షణ ద్వారా పోలీసులు అనూహ్య పరిస్థితుల్లో మరింత చాకచక్యంగా, సురక్షితంగా ఎలా స్పందించాలో అవగాహన పొందారని అదనపు ఎస్పీ తెలిపారు.ప్రజల భద్రత పోలీసుల ప్రధాన బాధ్యత అని, ప్రతి పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, ప్రొఫెషనలిజం, సేవాభావంతో మాబ్ కంట్రోల్ నిర్వహించగలగాలి అని తెలిపారు. ఇలాంటి మాక్ డ్రిల్లులు క్రమం తప్పకుండా నిర్వహించడం ద్వారా సిబ్బంది స్పందనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తున్నామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా, సిబ్బందికి అవగాహన కల్పించేందుకు స్మోక్ గన్స్, ఫైర్ ఇంజన్ ద్వారా మాబ్ పై ఎలా ఫైర్ చేయాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధమైన ఫైర్ వాడాలి అనే అంశాలను లైవ్ గా డెమో చేసి చూపించారు. దీనితో పోలీసు సిబ్బంది అనుభవం మరింత పెరిగిందని అధికారులు తెలిపారు.ఈ మాక్ డ్రిల్‌లో డీఎస్పీ నల్లపు లింగయ్య, సీఐ రామ్ లాల్, ఎస్సైలు భాగ్యలక్ష్మి రెడ్డి, నవీద్, అశోక్ బాబు, రమేష్, రేవతి, శివశంకర్, మద్దయ్య, కానిస్టేబుళ్లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News