ఎస్ఐ బోయిని సౌజన్య
బెజ్జంకి, నేటి సాక్షి:
బెజ్జంకి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో నూతన ఎస్ఐగా బోయిని సౌజన్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది పుష్పగుచ్ఛంతో ఆమెకు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎస్ఐ సౌజన్య మాట్లాడుతూ,
మండలంలో శాంతిభద్రతల పరిరక్షణే నా ప్రథమ కర్తవ్యం. అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక ఘటనలను అరికట్టడానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరం. ప్రజలు పోలీస్ శాఖకు సంపూర్ణ సహకారం అందించాలని ఆమె పేర్కొన్నారు.