నెటి సాక్షి, బాపట్ల జిల్లా, (బాపట్ల టౌన్)పరమశివుడు ఆశీస్సులు అందరి పై ఉండాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యులు, ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ శాసనమండలి సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్ అన్నారు. బాపట్ల పట్టణంలోని ఎస్ ఎన్ పి అగ్రహారంలో ఉన్న శ్రీ గంగా పార్వతీ వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవస్థానం శతాబ్ది ఉత్సవాలు సందర్భంగా అన్నం సతీష్ దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు.స్వామి వారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం కమిటీ సభ్యులు భక్తుల సహాయ సహకారాలతో దేవస్థానం 100 సంవత్సరాల వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారన్నారు. స్వామివారి సేవలో తన వంతు సేవా అందించడానికి ఐదు రోజులపాటు జరిగే పూజా కార్యక్రమాలకు వచ్చే భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని ఆ శివయ్య ఆశీస్సులతో సేవ చేసుకునే అదృష్టం వచ్చిందన్నారు. ఈ ఐదు రోజులు పాటు జరిగే కార్యక్రమాలు ఎంతో విజయవంతం కావాలని భక్తులందరూ భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థప్రసాదాలు సేకరించాలని ఆయన కోరారు. ఈ పూజా కార్యక్రమాలకు పీఠాధిపతులు, వివిధ ప్రముఖులు హాజరవుతున్నారని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా కమిటీ సభ్యులు పర్యవేక్షణ చేయాలని చెప్పారు.పోలీసులు, ఫైర్,విద్యుత్ శాఖ అధికారుల సూచనలు పాటించాలని కమిటీ సభ్యులకు వివరించారు.





