నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి నవంబర్ 5చౌడేపల్లి మండలం పుదీపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శివ కేశవుల అలంకారంలో భక్తులను అలరించింది వైష్ణవి దేవి ఆలయ అర్చకురాలు శ్రావణి ఉదయమే అమ్మవారికి పంచామృత అభిషేక చేసి కార్తీక మాసం శివకేశవులు ఇద్దరికీ విశేషమని ఈ కార్తీకమాసంలో సకల దేవతలు పూజింపబడతారని ఎంతో పరమ పవిత్రమైన ఈ మాసంలో శివకేశవ అలంకారంలో దర్శన భాగ్యం కల్పించారు ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు ఉభయదారులుగా చింతామణికి చెందిన వెంకటేశ్వర్లు రజిత కాటి పేరికి చెందిన బోయకొండప్పలు ఉభయదారులు గా వ్యవహరించారు





