Tuesday, January 20, 2026

శునకాలకు నిలయాలుగా పాఠశాల గదులు

నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 31మండలకేంద్రంలోని ఉన్నతపాఠశాల ఆవరణంలో నాడు-నేడు ఫేజ్‌ -2 పథకంలో అదనపు తరగతి గదులు 8 భవనాలు మంజూరైయ్యాయి. పాఠశాలలో 702 మంది విద్యార్థులు విద్యనభ్యశిస్తున్నారు. నాలుగు భవన నిర్మాణ పనులు ప్రారంభించి మద్యలో పనులు ఆపేశారు. గత ప్రభుత్వంలో నిర్మాణ పనులు చేపట్టి ఆపినప్పటినుంచి ప్రస్తుత చంద్ర బాబు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడంతో ఆభవనాల్లో నేడు శుకకాలకు నిలయాలుగా మారాయి. వీధి కుక్కలు పిల్లలను పోషించుకోవడానికి స్థావరంగా మలుచుకొన్నాయి. మరికొన్ని రూముల్లో వెనకబడిన బెంచీలకు స్టాకు రూముంగా మారింది. ఈ విషయమై హెచ్‌ఎం నాగరాజారెడ్డిను వివరణ కోరగా నిధులు మంజూరుచేస్తే పనులు పూర్తిచేయిస్తామని చెప్పారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News