నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)తిరుపతి, నవంబర్ 27 : శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ప్లాట్లును కేటాయింపు, పంపిణీ పక్రియ చేపట్టాలి అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్ లోని మినీ సమావేశ మందిరం నందు శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనుల పై ఇంచార్జీ జాయింట్ కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ దివాకర్ రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. శెట్టిపల్లి లే అవుట్ డెవలప్మెంట్ పనులకు పూర్తి చేసి అర్హులైన వారికి ప్లాట్లు కేటాయించాలని తెలిపారు. లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేయడానికి సంబంధిత అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. శెట్టిపల్లిలో ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన లేఔట్ నిర్మాణం జరుగుతుందనీ, అందులో రోడ్లు, డ్రైనేజ్, త్రాగు నీటి పైపులు, విద్యుత్ మరియు పార్కులు వంటి సదుపాయాలు సమగ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. లే అవుట్ డెవలప్మెంట్ పనులను సంబందిత అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకొని త్వరితగతిన పూర్తి చేస్తూ జంగిల్ క్లియరెన్స్ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో తిరుపతి ఆర్ డి ఓ రాంమోహన్, తుడా చీఫ్ ప్లానింగ్ అధికారి దేవి కుమారి, తుడా భూ సేకరణ అధికారి సుజన, తుడా సెక్రటరీ శ్రీకాంత్ బాబు,అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి వాణిశ్రీ,, సూర్యనారాయణమ్మ,తుడా ఈ ఈ రవీంద్రనాధ్, ఎస్.ఈ కృష్ణా రెడ్డి, తిరుపతి అర్బన్ తహసీల్దార్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.





