నేటి సాక్షి మిర్యాలగూడ రూరల్ ఆగస్టు 31:-
ఉద్యోగ విరమణ అనంతరం శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేయాలని పలువురు వక్తలు కొనియాడారు ఆదివారం నందిపాడు లోని శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్ లో ఆదివారం
బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నాల వెంకన్న యాదవ్ ఉద్యోగ విరమణ సన్మానోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్, మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు, నోముల భగత్ కుమార్ , రాష్ట్ర గొర్రెలు మేకల పెంపకం దారుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు లు మాట్లాడుతూ 29 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఎంతోమంది విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్ది వారి ఉన్నతి కోసం కృషిచేసిన వెంకన్న యాదవ్ ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తూ సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి పీడిత ప్రజల పక్షాన పోరాడుతూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో దారం మల్లేష్ యాదవ్ కళాబృందం పాడిన పాటలు సభికులను అలరించాయి
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు జూలకంటి రంగారెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, యాదవ ఉద్యోగుల సంఘం మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు గుడిపాటి కోటయ్య మిర్యాలగూడ పట్టణ యాదవ సంఘం అధ్యక్షులు కట్టబోయిన శ్రీనివాస్ యాదవ్ గంగుల బిక్షం, పి ఆర్ టి యు త్రిపురారం మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పులిపాటి సత్యనారాయణ, కొదమగుండ్ల రామ నరసయ్య, యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అర్వ అశోక్, నల్గొండ జిల్లా యాదవ సంఘం సాంస్కృతిక కార్యదర్శి దారం మల్లేష్ యాదవ్, పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల జానారెడ్డి, మండల విద్యాధికారులు రవి నాయక్, లక్ష్మణ్ నాయక్, బాలాజీ, బాలు, వెంకన్న, వరలక్ష్మి, యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బల గోపాలకృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ లు చీర పంకజ్ యాదవ్ ,జవాజి వెంకటేశం, పిసిసి రాష్ట్ర కార్యదర్శి పగిడి రామలింగయ్య, బిసి జె సి నాయకులు మారం శ్రీనివాస్, గిరిజన ఉద్యోగుల సంఘం మాలోతు దశరథ, కృష్ణ కాంత్ ప్రధానోపాధ్యాయులు ధర్మానాయక్, సైదిరెడ్డి, యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు రాష్ట్ర బాధ్యులు సోమనబోయిన సుధాకర్ బి సి టి యు జిల్లా అధ్యక్షులు పొదిలి బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాపోలు పరమేష్ , మండలి రవికుమార్, డొంకడోకుల వెంకటేశ్వర్లు, మెండె వెంకట్, చల్లా రవికుమార్, విష్ణు కుమార్, మందుల అశోక్ కుమార్, ధీరావత్ కిషోర్ నాయక్ కట్టెబోయిన సైదులు, నడ్డి బాలరాజు, మన్నెం వెంకటేశ్వర్లు, బెల్లి నాగరాజు ,జంగాలక్షణ్, ఉస్మాన్, శ్రీను, నరేందర్, వెంకట్, జానపాటి బాలయ్య తదితరులు పాల్గొన్నారు





