నేటి సాక్షి 18 మార్చి శ్రీశైలం: –శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ వి.రాముడు గారి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీశైలం దేవస్థానం పరిసర ప్రాంతాలు అయిన కొత్తపేట, మేకలబండ, మాణిక్యమ్మసేల పరిసర ప్రాంతాలలో జరిపిన దాడులు వివరాలు.. ఈరోజు నిర్వహించిన తనిఖీలలో భాగంగా, అక్రమ మద్యం తయారీ మరియు రవాణాపై కఠిన చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తం మూడు కేసులు నమోదు చేసి, ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది.ఈ సందర్భంగా, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన (60) మద్యం బాటిళ్ళు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం తయారీ, రవాణా మరియు విక్రయాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని, ప్రజలు కూడా సమాచారం అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ దాడులలో ఆత్మకూరు ఎక్సైజ్ స్టేషన్ సిఐ మోహన్ రెడ్డి, ఆళ్లగడ్డ ఎక్సైజ్ విజయ్ కుమార్, నంద్యాల ESTF సిఐ లక్ష్మణదాస్, కోయిలకుంట్ల ఎస్.ఐ సందీప్, కర్నూలు ఎన్ఫోర్స్మెంట్ సీఐ కిషోర్ కుమార్ మరియు వారి సిబ్బంది, నందికొట్కూరు ఎక్సైజ్ సి.ఐ రామాంజనేయులు ఎస్ఐలు రమేష్, డోన్ ఎస్.ఐ సోమశేఖర్, కర్నూల్ ఎస్.ఐ మధుసూదన్ రెడ్డి వీరాస్వామి పాల్గొనడం జరిగింది.





