. నేటి సాక్షి 16 ఫిబ్రవరి నంద్యాల:-నంద్యాల జిల్లా సమతా సైనిక దళ్ ఉపాధ్యక్షుడు సగినాల సురేష్, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, లీగల్ అడ్వైజర్ వాడాల రవికుమార్, ప్రజా సంఘాల నాయకులు శ్రీశైలంలో ఎన్నో తప్పిదాలు చేసిన ప్రభుత్వ శాఖలను వదిలిపెట్టి ఒక దళిత ఫారెస్ట్ అధికారిని బదిలీ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.శ్రీశైలం భక్తులకు ఎలా కాపాడాలి అనే విషయాము అధికార పార్టీ నిర్లక్ష్య వైఖరి, అంతేకాని దళిత ఆఫీసర్ ను బదిలి చేయడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు.శ్రీశైల మహా క్షేత్రంలో జరిగిన దేవస్థాన అధికారుల తప్పిదానికి అటవీ శాఖ ఉన్నతాధికారిని బాధ్యుణ్ణి చేస్తూ బదిలీ వేటు వేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 8వ తేదీ నుంచి శ్రీశైల మహా క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా అంతకు ముందే రెండు నెలల క్రితం నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వులో పెద్దపులుల అంచనా ప్రక్రియ కొనసాగింపకు (ఎన్ టి సిఏ ) నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (తేదీలు) నిర్ణయించింది. ఆ నిబంధనల మేరకు శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ బిల్డు డైరెక్టర్ బి.విజయకుమార్, ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విజ్ఞేశ్ అప్పావ్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ ప్రకారం నడుచుకున్నారు. అయితే శ్రీశైలం వెళ్లే పాదయాత్ర చేసే భక్తులకు నల్లమల అడవిలో అడ్డంకులు కల్పించారన్న సాకుతో శ్రీశైలం టైగర్ ప్రాజెక్ట్ విజయ్ కుమార్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి. ఉరుము విరిగి మంగళం మీద పడ్డట్టు దేవస్థానం అధికారుల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి దళిత సామాజిక వర్గానికి చెందిన అటవీశాఖ అధికారి బి.విజయ్ కుమార్ పై బదిలీ వేటు వేయడం తో ఆయనకు మద్దతు తెలుపుతూ సమతా సైనిక్ దళ్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు సగినాల సురేష్, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి.అంకన్న, లీగల్ అడ్వైజర్ & న్యాయవాది వాడాల రవికుమార్, పర్యావరణ ప్రేమికులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శ్రీశైలం దేవస్థానం ఈవో, దేవస్థాన రెవెన్యూ విభాగం అధికారి, ప్రభుత్వ పెద్దలు శివ భక్తులపై లాఠీచార్జ్ చేసిన సివిల్ పోలీసులపై చర్యలకు పూనుకోవాల్సి ఉండగా, అందుకు సాహసించలేక దళిత సామాజిక వర్గానికి చెందిన నంద్యాల జిల్లా అటవీ సంరక్షణ అధికారి మరియు ప్రాంతీయ సంచాలకులు బి.విజయ్ కుమార్ (ఐఎఫ్ఎస్ )ను బదిలీ చేయడాన్ని సమతా సైనిక నాయకులు, ప్రజా సంఘాల నాయకులు ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి బి.విజయకుమార్ మాట్లాడుతూ నేను భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నాకు ఆదర్శమని, భారత రాజ్యాంగం ప్రకారము కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవడం జరిగిందని, నా విధి నిర్వహణలో ఎటువంటి తప్పిదాలు చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయనని అన్నారు.





