(నేటిసాక్షి ప్రతినిధి మహేశ్వరం నవంబర్ 15:)*రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం లోని అమీర్ పేట గ్రామంలోని వెంకటేశ్వర ఆలయంలో శ్రీశ్రీశ్రీ పద్మావతి గోదా సమెత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి,ఎమ్మెల్సి నవీన్ రెడ్డి.ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని అందరికి మంచి జరగాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..





