Sunday, March 15, 2026

శ్రీశ్రీశ్రీ మాత మాణిక్యేశ్వరి మాత పై ఆరోపణలు చేయడం సమంజసం కాదు ఆరోపణలు చేస్తే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తాం….. మాధవరం మాణిక్యేశ్వరి మాత భక్తుడు గ్రామ మాజీ సర్పంచ్ రాజులయ్య….

నేటి సాక్షి,నారాయణపేట, అక్టోబర్ 31, శ్రీశ్రీశ్రీ మాతా మాణిక్యేశ్వరి ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేదే కాదని మాతా మానికేశ్వరి మాత భక్తుడు, మాజీ సర్పంచ్ రాజులయ్య హెచ్చరించారు. నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల కేంద్రంలో శ్రీ శ్రీ శ్రీ మాణిక్యేశ్వరి మాత దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ కు చెందిన ఇద్దరు వ్యక్తులు శ్రీ శ్రీ మాతా మాణిక్యేశ్వరి మాత పై అసత్యపు ప్రచారాలు చేయడం సమంజసం కాదన్నారు. మాతా మాణిక్యేశ్వరి మాత కు సంబంధించిన భూములు తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో భూములు ఉన్నాయన్నారు . మాతామానికేశ్వరి ట్రస్ట్ సభ్యులే కాపాడుకుంటూ వస్తున్నారని ఆయన గుర్తు చేశారు. కొందరు మాతా మాణిక్యేశ్వరి మాత పై అసత్యపు ప్రచారాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ శుక్రవారం మరికల్ పోలీస్ స్టేషన్లో మాణిక్యేశ్వరి మాత ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు కనకప్ప, ఆంజనేయులు వెంకటన్న మొగులన్న, పుణ్యశీల, కాటప్ప, బాలమ్మ, కురువ పెద్ద కట్టప్ప, యాదయ్య, చిన్న కట్టప్ప, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News