Thursday, March 12, 2026

శ్రీ కొండల లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన వర్సిటీ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదునాన్ టీచింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పోతురాజు యాదయ్యకార్యదర్శి చెంచు రామయ్య

( నేటి సాక్షి) జనవరి:19 ప్రతినిధి శివకుమార్.రాజేంద్రనగర్:శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం ఇచ్చిన ఉద్యోగం నోటిఫికేషన్ అడ్డుకోవాలని కొందరు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వర్సిటీ నాన్ టీచింగ్ అధ్యక్షులు పోతురాజు యాదయ్య, కార్యదర్శి చెంచు రామయ్య,తీవ్రంగా ఖండించారు.కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్టను భంగం కలిగించేందుకు ప్రయత్నించడం తీవ్రంగా ఖండనీయం అని వారు తీవ్రంగా మండిపడ్డారు. గత 12 సంవత్సరాలుగా ఒక్క నియామకం కూడా జరగని పరిస్థితుల్లో, డాక్టర్ దండ రాజిరెడ్డి ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి 79 అసిస్టెంట్ ప్రొఫెసర్ 17 ప్రొఫెసర్ 44 అసోసియేట్ ప్రొఫెసర్ల నియామ కోసం అనుమతి తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేశారని అన్నారు.అధ్యాపక పోస్టులను తీసుకువచ్చి విశ్వవిద్యాలయ అభివృద్ధికి బలమైన పునాది వేశారని స్పష్టం చేశారు.అలాంటిది నోటిఫికేషన్ జీర్ణించు కోలేక,స్వార్థ ప్రయోజనాలతో కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తూ యూనివర్సిటీ గౌరవాన్ని దెబ్బతీయడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని,పేర్కొన్నారు.పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలనే ఉద్దేశంతో నోటిఫికేషన్ విడుదల చేయడాన్నే వక్రీకరించి అసత్య ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్యగా వారు తీవ్రంగా మండిపడుతున్నారు. పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించాల్సిన సమయంలో యువ శాస్త్రవేత్తల భవిష్యత్తుతో చెలగాటం ఆడేలా కావాలనే తప్పుడు ప్రచారాలు చేయడం మన్నించరాని నేరమని స్పష్టం చేశారు.విద్యార్థుల అకాడమిక్ అభివృద్ధిని అడ్డుకునే ఈ రకమైన నీచ కుట్రలను తక్షణమే నిలిపివేయాలని,కోరారు.లేనిపక్షంలో సంబంధితులపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని నాన్‌టీచింగ్ అసోసియేషన్ సభ్యులు హెచ్చరించారు.బోర్డు సభ్యులు వైస్ ప్రెసిడెంట్ కే.రాజేశ్వరి,వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ. అపర్ణ,కోశాధికారి ఎస్.రాజు అసోసియేషన్ సభ్యులు తదితరులు ఈ సమావేశాలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News