నేటిసాక్షి/మంగపేట /ములుగు (ప్రతినిధి)మండలంలో వాగొడ్డుగూడెం గ్రామ పంచాయతీ పరిదిలో గల లక్ష్మీ నర్సాపూర్ గ్రామంలో శ్రీ నాగులమ్మ జాతర మొదటిరోజున మండె మెలిగే పండగను ఆదివాసీ పూజారులు వడ్డెలు మంగళవారం తెల్లవారుజామున ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా ఉదయం శ్రీ నాగులమ్మ ఆలయానికి ముందు తోరణ స్తంభాలను నిలిపి,పసుపు కుంకుమలతో అలంకరించిన గడపను ప్రతిష్టించారు.అనంతరం వేప మండలు,మామిడి మండలతో కట్టిన దండను పూజారులు వడ్డెలు ఆదివాసీ ఉపాద్యాయ సంఘ నాయకులతో కలిసి తోరణాన్ని కట్టారు అనంతరం గోదావరి జలాలతో శుద్ధి చేసిన శ్రీ నాగులమ్మ కు చెందిన అడారాలను(కుండలు) పసుపు కుంకుమ తో అలంకరించి ధూపం వేసి ప్రత్యేక పూజలు చేసారు అనంతరం శ్రీ నాగులమ్మ అమ్మవారికి చెందిన డాలు గుడ్డలకు ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం వాటిని డోలు వాయిద్యాల నడుమ ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా ఆడించారు సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా అమ్మవారి గర్భాలయం మధ్యాహ్నం 12:30గంటలకు మూసి తిరిగి రాత్రి 8:30గంటలకు ఆలయ శుద్ధి అనంతరం తెరిచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం తెల్లవారు ఝామున మండె మెలిగె కార్యక్రమాన్ని ఆదివాసీ సాంప్రదాయ బద్ధంగా ప్రత్యేక పూజలతో నిర్వహించారు ఆలయ ప్రధాన పూజారి బాడిశ రామకృష్ణ స్వామి ,ప్రధాన పూజారి బాడిశ నాగరమేష్ ఆధ్వర్యం లో పూజారులు సోడి సత్యం కుర్సం పుల్లయ్య కట్టం సమ్మక్క చౌళం భవాని,మడకం సుప్రజ పోలిశెట్టి స్వరూప వడ్డెలు కోర్స శ్రీకాంత్ మూయబోయిన శివ తుర్స చిన్నబ్బాయి కారం రాజేష్ పూజ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆదివాసి ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షులు కొండ చెంచయ్య మద్దెల అంజయ్య జబ్బ రవి గుండం పురుషోత్తం చౌలం కృష్ణమూర్తి కొమరం అశోక్ బొగ్గం సర్వేశం వాసం సారంగపాణి గొప్ప సమ్మారావు మల్లికార్జున రావు కొమరం రామనాధం కులపెద్దలు కుర్సం విష్ణుమూర్తి మడకం రాజేశ్వర్ రావు చౌళం వెంకటేశ్వర్లు ఇందారపు రమేష్ పాల్గొన్నారు.





