నేటి సాక్షి, నారాయణపేట డిసెంబర్ 4,పడమటి అంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా గురువారం శ్రీ పడమటి ఆంజనేయస్వామి వారిని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి దర్శించడం జరిగినది. ఈ సందర్భంగా దేవాలయ ఈవో కవిత మరియు ఆలయ ధర్మకర్త ప్రాణేష్ ఆచారి పూజారులు రాఘవేంద్ర చారి అరవింద చారి మాజీ ఈవో రాఘవేందర్ వారిని ఘనంగా సన్మానించి ఆలయం లోపలికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం వారిని శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిన్నా హనుమంతు బిఆర్ఎస్ పార్టీ నాయకులు జుట్ల శంకర్ నరసింహారెడ్డి శివారెడ్డి ఈశ్వర్ యాదవ్ సాగర్ వన్నెకారి రాజు తదితరులు పాల్గొన్నారు.





