( నేటిసాక్షి): శంకర్‌పల్లి మండల పరిధిలోని చందిప్ప గ్రామ శివారులో గల 11వ శతాబ్దానికి చెందిన మహిమగల శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయంలో బుధవారం మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారుడు (క్యాబినెట్ హోదా) బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కుమారుడు రజిత్ రెడ్డి, కీర్తి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు ఎమ్మెల్యే కుమారుడిని స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రమోద్, కమిటీ సభ్యులు ఉన్నారు.





