నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)శ్రీ లక్ష్మీ గ్రూప్ అధినేత ప్రసాద్ సేవలు ఎంతో అభినందనీయం అని ప్రభుత్వ విప్ గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ అన్నారు గురువారం పెనుమూరు మండలం సిహెచ్ సి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వెదురు కుప్పం మండలం పచ్చికాపలం లో ఉన్న శ్రీ లక్ష్మీ గ్రూప్ అధినేత ప్రసాద్ ఉచితంగా ఏసీ… 50 కుర్చీలు ఆసుపత్రికి కావాల్సిన సామాగ్రిని సుమారు లక్ష రూపాయలు విలువ చేసే సామాగ్రిని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సమక్షంలో అందించడం జరిగింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో మెలగాలని ప్రసాద్ లాంటి గొప్ప వ్యక్తులు మన నియోజకవర్గంలో ఉండడం ఎంతో సంతోషమని తెలిపారు అలాగే లక్ష్మీ గ్రూప్ అధినేత ప్రసాద్ ని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సాలవుతో సన్మానించి సత్కరించి అభినందించారు.. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రుద్రయ్య నాయుడు, కృష్ణమూర్తి నాయుడు వైద్యాధికారులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు





