నేటి సాక్షి ప్రతినిధి/ శంకర్‌పల్లి: ( సుధాకర్ గౌడ్ ముదేలి ):వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీలోని శ్రీ గోసగుండ్ల శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు శివ ప్రకాష్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం శివ ప్రకాష్ మాట్లాడుతూ స్వామివారి దీవెనలతో కాలనీవాసులు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలియజేశారు. ఫనిగిరి కాలనీ అధ్యక్షుడు అజయ్, ఆలయ చైర్మన్ కృష్ణారెడ్డి.. శివ ప్రకాష్ ను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. కార్యక్రమంలో నరేందర్ రెడ్డి, తోట శ్రీను, స్వామి, శ్రీను స్వామి, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్, బిఆర్ఎస్ నాయకులు రవి యాదవ్, కళ్యాణ్, ప్రవీణ్ కుమార్, గణేష్, గానీ, హరీష్, మహేష్, అసిఫ్, వల్లీ, రిషి గౌడ్ ఉన్నారు.

