నేటి సాక్షి, కోడిమ్యాల నవంబర్,26, కొడిమ్యాల కొడిమ్యాల మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం ఈ నెల 23 నుంచి ప్రారంభం కాగా మంగళవారం రాత్రి దేవుని కళ్యాణం జరుగుతుండగా, తిప్పర వేణి నాగరాజు, 12 సంవత్సరాల కూతురు మధుశ్రీ, తోటి స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా ఆమె మెడకి లూజ్ కనెక్షన్ ఉన్న కరెంటు వైర్ తగలడంతో, పడిపోతానేమో అన్న భయంతో పాప స్టీలు రాడును పట్టుకోగా కాళ్ళకి చెప్పులు లేవడంతో కరెంటు షాక్ కొట్టి మధు శ్రీ అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. అప్పటిదాకా దేవుని ఎదుర్కోలులో ఆటపాటలతో, కొలలాడుతూ డాన్సులు చేస్తూ సంతోషంగా ఉన్న పాప హఠాత్తుగ ఉలుకు పలుకు లేకుండా పడిపోవడంతో తండ్రి పలువురు స్థానికులు హాస్పిటల్ కు తరలించగా, పాప అప్పటికే చనిపోయింది అని డాక్టర్ చెప్పడంతో, ఊరంతా కన్నీటి సంద్రంలో మునిగిపోయింది, రాత్రి అదే సమయంలో మృతదేహాన్ని జిల్లా ఏరియా ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తీసుకెళ్లారని స్థానికులు తెలిపగా, మధు శ్రీ మృతికి అసలు విషయాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది.





