నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)*రామచంద్రాపురం*మండలంలోని రాయల చెరువు లో వెలసియున్న శ్రీ శక్తి పీఠంలో గురువారం శ్రీ కాలభైరవ నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి కుర్తాళం సిద్దేశ్వరీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానందభారతీ మహాస్వామి వారి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి పీఠాదీశ్వరి మాతాజీ శ్రీ శ్రీ శ్రీ రమ్యానందభారతీ స్వామినీ వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవముగా జరుగుతున్నాయి. శ్రీ కాలభైరవ స్వామి కి పంచామృత అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం శత సహస్ర మాషచక్ర (లక్ష మినప గారెలతో) నిర్వహిస్తున్న హోమలలో భాగముగా రెండవ రోజు 11,116 మాషచక్ర ములతో విద్యను, జ్ఞానమును, సిద్ధిని ప్రసాదించే శ్రీ సిద్ధ భైరవ హోమము హోమము నిర్వహించారు. ఈ కార్యక్రమనికి దేశ విదేశాల నుండి విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురువుల, దేవతల అనుగ్రహమును పొందారు.అందరికీ అన్న ప్రసాద వితరణ చేశారు





