నేటి సాక్షి, నారాయణపేట, జూన్ 18,నారాయణపేట జిల్లాలోని మరికల్ మండల పరిధిలోని తీలేరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవత జాతర మహోత్సవాల కార్యక్రమానికి నారాయణపేట జిల్లా భీష్మరాజ్ ఫౌండేషన్ అధినేత రాజ్ కుమార్ రెడ్డి బుధవారం నాడు దర్శించుకున్నారు. అనంతరం శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీశ్రీశ్రీ దత్తాత్రేయ స్వామి వారిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తామని ఆయన వివరించారు. తీలేరు అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఊరేగింపుగా భీష్మ ఫౌండేషన్ చైర్మన్ రాజ్ కుమార్ రెడ్డి నిర్వహించి అనంతరం శాలువాలతో సన్మాన కార్యక్రమాలను గ్రామస్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో తిప్పన్న, సంతోష్, హనుమంతు, నాయుడు, సంతోష్, గోపి, నందు, చిన్న వెంకటన్న పెద్ద కురుమన్న, ఆశన్న, వెంకటన్న శ్రీనివాసులు మణికొండ వెంకటన్న రామచంద్రయ్య మైబు వెంకటయ్య,కురుమన్న ఎల్,వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

