నేడు సాక్షి తొగుట జనవరి.09వడ్డే.నర్సింలుసిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని జప్తి లింగారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ సింగరాల మల్లన్న జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను గ్రామ సర్పంచ్ బక్క కనకయ్యతో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు చిలివేరి మల్లారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఆదివారం రోజున సింగరాల మల్లన్న జాతర ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. పార్టీలకు అతీతంగా స్వామివారి జాతర ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. అంగరంగ వైభవంగా గ్రామస్తులందరూ స్వామివారికి బోనాలు సమర్పించి మొక్కలు చెల్లిస్తారన్నారు. స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ జిల్లాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని తెలిపారు. స్వామివారి ఆలయం వెనకాల ఈశాన్యం భాగంలో స్వామివారి ఊట బావి ఉందని ఆ భావినీరు తాగిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. గ్రామస్తుల సహకారం మరియు వివిధ పార్టీల నాయకులందరూ కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. స్వామివారి ఆలయంలో రాతికడప ఉండడం వలన ఇప్పటివరకు గ్రామంలో వడగళ్ల వర్షం కురువలేదని తెలిపారు.ఈ కార్యక్రమం లో భూపాల్ రెడ్డి, యాదిరెడ్డి, సత్యనారాయణ, ఎల్లారెడ్డి,నర్సింహారెడ్డి తిరుమల్, ఆంజనేయులు,స్వామి గౌడ్,వినయ్, మహేష్, నర్సింలు, కనకయ్య తదితరులు.

