నేటిసాక్షి ప్రతినిధి,షాద్ నగర్,(చిక్కిరి. శ్రీకాంత్)
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం సివిల్స్ ర్యాంకర్లను గవర్నర్ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సన్మానించారు. బుధవారం రాజ్ భవన్ లో సివిల్స్ ర్యాంకర్లతో ఇన్స్పైర్ 2025 కార్యక్రమం జరిగింది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి చెందిన మాజీ సిడిపిఓ నాగమణి కుమారుడు భరద్వాజ్ సివిల్స్ లో 905 ర్యాంకు సాధించడం, ఐఏఎస్ గా గ్రూపు1 లో కూడా ఎంపిక కావడం పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భరద్వాజ్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతిఒక్కరి జీవితంలో గెలుపోటములు సాధారణమని, ఓటమి పాలయినప్పుడు నిరాశ చెందకుండా ముందుకెళ్లాలని సూచించారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మందికి సివిల్స్ ర్యాంకులు వస్తున్నాయని, ఈ ఏడాది కూడా సెలక్ట్ అయ్యారని వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు..
షాద్ నగర్ సివిల్స్ ర్యాంకర్ భరద్వాజను సన్మానించిన తెలంగాణ గవర్నర్
—- షాద్ నగర్ మాజీ సిడిపిఓ నాగమణి కుమారుడు భరద్వాజ్