Thursday, March 19, 2026

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం..కట్టుకొనే దుస్తులు ,నగదు ,బంగారం బూడిద..సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం..

నేటి సాక్షి పాలేరు , నవంబర్ 21 :తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలించిట్టు .. అసలుకే ఇల్లు లేదు .. తల దాచుకోవడానికి కిరాయి ఇంట్లో ఉంటున్నారు.. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసింది.. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఇల్లు నిర్మాణం కోసం డబ్బులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు.. ఇల్లు నిర్మాణంలో ఉండగానే షార్ట్ సర్క్యూట్ వల్ల కిరాయికి ఉంటున్న ఇల్లు దగ్దం అయింది.. షార్ట్ సర్క్యూట్ ఆ కుటుంబానికి తీరని దుఃఖం మిగిల్చింది.. ఈ ఘటన మండలంలో జరిగింది.. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. కూసుమంచి మండలం గట్టుసింగారం గ్రామానికి చెందిన ఆడెపు వీరాస్వామి వ్యవసాయం కుటుంబం.. ఇల్లు లేని వీరాస్వామి స్థానికంగా ఉన్న మాజీ ఉద్యోగికి చెందిన పెంకుటిల్లులో కిరాయికి ఉంటున్నాడు.. ఇటీవల ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఇల్లు నిర్మాణపు పనులు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో వీరాస్వామి కిరాయికి ఉంటున్న ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా ఇంట్లో మంటలు ఎగసి పడి పూర్తిగా దగ్దం అయింది.. మంటలను గమనించిన వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. కూసుమంచి , నేలకొండపల్లి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిగా ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.. అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిపోయింది.. ఇంట్లో దుస్తువులు ,బంగారం ,నగదు , వంట సామగ్రితో సహా సర్వం కాలి బూడిదైంది.. ఈ ప్రమాదంలో సుమారు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు బాధితుడు వీరాస్వామి ఆవేదన చెందారు.. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఎలా పూర్తి చేయాలో తెలియక దుఃఖంలో మునిగారు.. ఉన్నట్లు ఉండి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం రోడ్ మీద పడ్డది. ఎలాగైనా తమ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నాడు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News