నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) వెదురుకుప్పం మండలంలోని తిరుమలయ్య పల్లి పంచాయతీ షికారి కాలనీ లో ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులులకు సహృదయంతో శ్రీ లక్ష్మి బ్రాంచెస్ అధినేత ప్రసాద్ (పచ్చి కాపల్లం) విద్యా సామాగ్రి ని శుక్రవారం పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోరిక మేరకు సుమారు 45 మంది విద్యార్థులకు ఒక సంవత్సరానికి సరిపడ్డ విద్యా సామాగ్రి ని 13000/- రూపాయల నిధులు తో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు శ్రీ లక్ష్మి బ్రాంచెస్ అధినేత ప్రసాద్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.