Saturday, March 7, 2026

షీ టీం పై విద్యార్థులకు అవగాహన

నేటిసాక్షి, మిర్యాలగూడ (ఫిబ్రవరి 06) : పట్టణంలోని రెడ్డి కాలనీలోని శాంతినికేతన్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ కోలా శ్రీనివాస్ ఆధ్వర్యంలో, షీ టీం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా షీ టీం ఏఎస్ఐ మాట్లాడుతూ, మహిళల రక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే ‘టీ–సేఫ్’ యాప్ ను ప్రతి ఒక్కరూ తమ మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని సూచించారు. మహిళల భద్రత, చట్టపరమైన రక్షణ అంశాలపై వివరించి, సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News