Saturday, March 7, 2026

*ష్…. అంతా గప్ చుప్.!*—— * మున్సిపాలిటీల్లో అంతా సైలెంట్ * కాంగ్రెస్ నాయకుల్లో బీ-ఫామ్ ల లొల్లి * కన్ఫ్యూజ్ అవుతున్న ఓటర్లు * ఓటర్లను బుజ్జగిస్తున్న ఇరువర్గాలు* ఈరోజు బీ-ఫామ్ లకు తెర * వర్గ పోరుతో ఇతర పార్టీలకు గెలుపే అవకాశం—-

నేటి సాక్షి-జగిత్యాల (ఇమ్మడి విజయ్ కుమార్ ) రానున్న రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొదటి ఘట్టం నామినేషన్ల పర్వం పూర్తయింది. నామినేషన్లు పూర్తయిన రెండు రోజులుగా మున్సిపాలిటీలు అంతా సైలెంట్ గా మారాయి. బిజెపి,బిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేషన్ వేసిన అభ్యర్థులు పార్టీ తరపున ప్రచారాలు ప్రారంభించారు. టిఆర్ఎస్ నాయకులు గత 3 సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారం సాగిస్తున్నారు. బిజెపి అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ఉందని మమ్మల్ని గెలిపిస్తే మున్సిపాలిటీ మరింత అభివృద్ధి చేస్తామని పార్టీ తరఫున ప్రచారం సాగిస్తున్నారు.*కాంగ్రెస్ అభ్యర్థుల్లో బీ-ఫామ్ ల లొల్లి*కాంగ్రెస్ అభ్యర్థులు మాత్రం బీ-ఫామ్ ల లొల్లి ఇంకా కొలిక్కి రాలేదు. జగిత్యాల మున్సిపాలిటీలో ఓవైపు జీవన్ రెడ్డి వర్గం మరోవైపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వర్గం అభ్యర్థులు బీ-ఫామ్ ల భయం పట్టుకుంది. దీంతో ప్రచారం చేయడానికి ఆసక్తి చూపక అంతా సైలెంట్ గా ఉండడంతో కాంగ్రెస్ లో సైలెంట్ వాతావరణం నెలకొంది. సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి జెండా మోసిన కార్యకర్తలకే బీ-ఫామ్ ఇవ్వాలని అధిష్టానం పై ఒత్తిడి చేయగా.. మరోవైపు ఎమ్మెల్యే బి ఫామ్ లు మాకు కూడా కావాలంటూ అధిష్టానం పై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో జగిత్యాలలో కాంగ్రెస్ లో వర్గపోరు హాట్ టాపిక్ గా మారింది. *కన్ఫ్యూజ్ అవుతున్న ఓటర్లు*రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఉండడంతో కాంగ్రెస్ తమ నాయకులను గెలిపించుకోవాలనుకున్న ఓటర్లకు వర్గ పోరు కన్ఫ్యూజ్ చేస్తుంది. ఒక్కో వార్డులో కాంగ్రెస్ తరపున దాదాపు రెండు మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. దీంతో తమ నాయకునికే బీఫామ్ వస్తుందన్న నమ్మకం ఓటర్లలో లేకుండా పోయింది. ఒకవేళ తాము అనుకున్న నాయకునికి బీ-ఫామ్ రాకపోతే ఏ నాయకుడిని ఎన్నుకోవాలో అర్థం కాని పరిస్థితి ఓటర్లలో నెలకొంది. *ఓటర్లను బుజ్జగిస్తున్న ఇరు వర్గాలు*బిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్ కు ఓటు వేయాలంటూ ఓటర్లను బుజ్జగిస్తున్నారు. మేము నిలబడుతున్నాము అని ప్రచారం కంటే ఎక్కువ చేతి గుర్తు కాంగ్రెస్ అంటూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో సీనియర్ జీవన్ రెడ్డి వర్గాన్ని గెలిపించాల లేదా సంజయ్ కుమార్ వర్గాన్ని గెలిపించాలా అనే కన్ఫ్యూజ్ ప్రజల్లో నెలకొంది. *ఈరోజున బీ-ఫామ్ లకి తెర*మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఫిబ్రవరి మూడో తేదీన బీ-ఫామ్ ల కు తెర పడనుంది. అప్పటిదాకా ప్రచారం చేయాలా వద్దా అయోమయంలో కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు అంతా సైలెంట్ గా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు అంతా సైలెంట్ వాతావరణం నెలకొంది. బీ-ఫామ్ లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ లో ప్రచారం ఊపొందుకుంటుందని ఓటర్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఎన్నికలు జగిత్యాల లో కీలకంగా మారనున్నాయి. కార్యకర్తల్లో రాజకీయ భవిష్యత్తును నిర్ణయించడంలో మున్సిపల్ ఎన్నికలు కీలకంగా మారుతాయని చెప్పకనే చెప్పొచ్చు. *వర్గ పోరుతో ఇతర పార్టీల గెలుపుకు అవకాశం*జగిత్యాల లో కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉన్నందున ఇతర పార్టీ అభ్యర్థులకు గెలుపుకు అవకాశం చాలా ఉంది. బిజెపి, బీఆర్ఎస్ అభ్యర్థులు తమ వార్డుల్లో ప్రచారం కొనసాగిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే వారు తమ గెలుపుకు దగ్గరైనట్లే నని అందరూ భావిస్తున్నారు. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందని 13వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.!———

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News