నేటి సాక్షి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలకు ఎస్పీ నితికా పంత్ విజ్ఞప్తిసంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊర్లకు వెళ్లే జిల్లా వాసులకు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ కీలక సూచనలు చేశారు.పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి ఎక్కువ రోజుల పాటు బయటకు వెళ్లే వారు, వెళ్లే ముందు తప్పనిసరిగా సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు లేదా బీట్ పోలీస్ అధికారికి సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.పండుగ సమయంలో కుటుంబ సమేతంగా గ్రామాలకు వెళ్లే వారు అధికంగా ఉంటారని, ఇదే అవకాశంగా భావించి దొంగలు చోరీలకు పాల్పడే ప్రమాదం ఉందని ఎస్పీ తెలిపారు. ముందుగానే పోలీసులకు సమాచారం ఇస్తే, పెట్రోలింగ్‌లో భాగంగా ఆయా ఇళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఆమె వెల్లడించారు.ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేటప్పుడు నగదు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో లేదా సురక్షిత ప్రాంతాల్లో భద్రపరుచుకోవడం ఉత్తమమని సూచించారు. చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే చోరీలను నివారించి పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పేర్కొన్నారు.నేరాల నివారణలో ప్రజల సహకారం పోలీస్ శాఖకు ఎంతో అవసరమని, పండుగ సీజన్లో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని ఎస్పీ నితికా పంత్ తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని ఆమె సూచించారు.

