నేటి సాక్షి(పూరెళ్ల బాపు)……………………………………..*రేవంత్ రెడ్డి పాలన లో రాష్ట్రం అభివృద్ధి**అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి**రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పాలన దేశానికే ఆదర్శం**రాహుల్ గాంధీని దేశ ప్రధానిగా చేయడమే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని పిలుపు*జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో మాజీ మంత్రి వర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.*అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ*రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చారు అని కొనియాడారు.ఎన్నికల హామీలు అమలు చేస్తూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. జీవన్ రెడ్డి నిబద్ధత, నిజాయితీ అందరికీ ఆదర్శప్రాయం,జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గౌరవం కల్పించారు.ప్రజలకు అందుబాటులో ఉండి, సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు.ప్రజల పక్షం ఉండాలని సూచిస్తూ, అందరిని ముందుకు నడుపుతున్నారు.*అనంతరం మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ*సీఎం రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపారు.ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చాలని యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండు పర్యాయాలు పని చేసినా, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదు.రేవంత్ రెడ్డి పీ సి సీ అధ్యక్షుడుగా ప్రజల్లో విశ్వాసం నింపి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ లు అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.మహిళలకు ఏవిధమైన ఆంక్షలు లేకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు.నిరుపేద కుటుంబానికి అండగా నిలిచేందుకు సిలిండర్ 500 లకే అందిస్తున్నారు.దివంగత ముఖ్యంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డివ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తే, రేవంత్ రెడ్డి గృహ అవసరాలకు ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నారు.రాష్ట్రంలో 75 శాతం ప్రజలు గృహ అవసరాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకుంటున్నారు.దశాబ్ద కాలంగా కనుమరుగైన గృహ నిర్మాణ సంస్థకు జీవం పోశారు.సీఏం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తున్నారు. దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలిచేలా సామాజిక వెనకబాటుతనానికి గురి అవుతున్న రిజర్వేషన్ కల్పించడమే లక్ష్యంగా బీసీలకు రిజర్వేషన్ల కోసం అసెంబ్లీ లో తీర్మానం చేసి, రిజర్వేషన్ అమలు కోసం కృషి చేశారు.రైతులకు రైతు భరోసా అందిస్తూ, పంటలకు మద్దతు ధర, బోనస్ కల్పిస్తూ అండగా నిలుస్తున్నారు.మొక్కజొన్న క్వింటాల్ కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.అర్హులకు రేషన్ కార్డులు అందిస్తూ, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా చేయడమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలని జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు.కార్యక్రమంలో బండ శంకర్, కళ్లేపల్లి దుర్గయ్య,గాజుల రాజేందర్,గాజంగి నందయ్య, కొండ్ర జగన్, రమేష్ రావు, తాటిపర్తి విజయ లక్ష్మీ దేవేందర్ రెడ్డి, అనుమల్ల జయశ్రీ, పుప్పాల అశోక్, చందా రాధాకృష్ణ, పిప్పరి అనిత, బీరం రాజేష్, నేహాల్, మున్నా, మొగిలి, గంగాధర్, ఎలిగేటి నర్సయ్య, చాంద్ పాషా,గుండా మధు, నక్క జీవన్, బొల్లి శేఖర్, శీలం సురేందర్,రజనీకాంత్, జలంధర్, వేణు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.





