Wednesday, July 23, 2025

సంక్షేమ పథకాల ప్రదాత… అన్నదాతల ఆత్మబంధువు..!రాయికల్ లో ఘనంగా వైఎస్సార్ జయంతి


నేటి సాక్షి, రాయికల్
సంక్షేమ పథకాల ప్రదాత …అన్నదాతల ఆత్మబంధువు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్సార్ని కాంగ్రెస్ పట్టణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మ్యాకల రమేష్, గోపి రాజారెడ్డి అన్నారు. మంగళవారం రాయికల్ పట్టణ,మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను వైఎస్ విగ్రహానికి,చిత్రపటానికి పూలమాల వేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిరుపేద ప్రజలకు మెరుగైన వైద్యం అందేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ,104,108 సేవ‌లు ప్రవేశపెట్టి నిరుపేద ప్రజల ప్రాణాలను కాపాడారని పేర్కొన్నారు.ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌,రైతుల‌కు ఉచిత విద్యుత్‌,వ్యవసాయ పనిముట్ల రాయితీ,జ‌ల‌య‌జ్ఞం ఇలా ఎన్నో ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఎప్పటికీ చిరంజీవేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ దాసరి గంగాధర్, నాయకులు కొయ్యడి మహిపాల్, షాకీర్, బాపురపు నర్సయ్య,బత్తిని భూమయ్య, తంగేళ్ల రమేష్, షంషీర్, తలారి రాజేష్,మున్ను,హరీష్ రావు, రాజు దొర, వకీల్ మురళి, మండ రమేష్, కడకుంట్ల నరేష్, రాకేష్ నాయక్, ఏలేటి రాజేందర్, భూక్యా నందు, కొత్తపెల్లి గోపాల్, భూమా గౌడ్, బత్తిని నాగరాజు, రాజీవ్, సాగర్, రాంకీ, సంతోష్, రాజేష్, రాజారెడ్డి, కాటిపెల్లి రాంరెడ్డి, మసుద్ ,రవి,కటుకం సాయి, సంతోష్, శివ, రాజేష్, కిశోర్, రాజారెడ్డి, నవీన్, తిరుపతి, షాబీర్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు , గ్రామ శాఖ అధ్యక్షులు,వార్డు ఇన్చార్జీలు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మూటపల్లి లో…
రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలో స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిఎం దివంగత డాక్టర్:వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిర్వహించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆదేశానుసారం మనబట్టి (చౌరస్తా) వద్ద ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్: 08RKL01: వైఎస్సాఆర్ జయంతి దృశ్యం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News