నేటి సాక్షి, బాపట్ల జిల్లా (కర్లపాలెం)సంగుపాలెం కోడూరు పరిధిలో చందోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ ఆధ్వర్యంలో బహిరంగ ప్రదేశాలలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయుట జరిగినది. ఈ సందర్భంగా మండల తెలుగు మహిళ అధ్యక్షురాలు డాక్టర్ గ్లోరి యానెట్ సౌపాటి చందోలు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శివకుమార్ గారిని అభినందించి మండల పరిధిలో భద్రతకు వీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ మండలంలోని మిగతా గ్రామాలలో కూడా వీరి ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు త్వరలో పూర్తి అవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా శివకుమార్ గారు మాట్లాడుతూ CC కెమెరా ద్వారా భద్రత, నిఘా, రియల్ టైమ్ పర్యవేక్షణ మరియు సంఘటనలను రికార్డ్ చేయడం వంటివి ఇళ్ళు, కార్యాలయాలు, వ్యాపారాలు మరియు పబ్లిక్ ప్రదేశాలలో నేరాలను నివారించడానికి, దొంగతనాలను ఆపడానికి, ప్రమాదాలు జరిగినప్పుడు సాక్ష్యాలను అందించడానికి, మరియు అవాంఛిత కార్యకలాపాలను నివారించడానికి ఉపయోగపడతాయి ఈ సందర్బంగా తెలియజేశారు. ఆధునిక CCTV కెమెరాలు పూర్తి చీకటిలో కూడా పనిచేస్తాయి మరియు 24/7 నిరంతర పర్యవేక్షణను అందిస్తాయి. రికార్డ్ చేయడం ద్వారా నేరస్థులను గుర్తించడానికి లేదా చట్టపరమైన చర్యలకు సాక్ష్యంగా ఉపయోగించవచ్చు అని తెలిపారు. గ్రామస్తులు చట్టాన్ని గౌరవించి భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలని గ్రామస్తులను ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో చందోలు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.





