నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల మండలం సంగెం గ్రామంలో ‘వృద్ధి సంస్థ’ ఆధ్వర్యంలో, పశుసంవర్ధక శాఖ సహకారంతో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు.ఈ శిబిరంలో పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో ముఖ్యంగా ఫెర్టిలిటీ క్యాంపు నిర్వహించి పశువుల గర్భధారణ సమస్యలపై వైద్యులు ప్రత్యేక చికిత్సలు అందించారు.*గర్భకోశ చికిత్స – మందుల పంపిణీ*ఈ ఉచిత పశువైద్య శిబిరంలో మొత్తం 51 పశువులకు గర్భకోశ సంబంధిత చికిత్సలు చేసి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. అలాగే 17 దూడలకు నట్టల మందులు ఇచ్చారు.పశువుల ఆరోగ్య స్థితి, పోషణ విధానాలపై రైతులకు వైద్యులు అవగాహన కల్పించారు.ఈ శిబిరాన్ని పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ మాదేష్ మరియు ప్రసన్న సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రైతులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చీటీ స్వరూప,మండల పశువైద్య అధికారి సంతోష్ కుమార్ DLDA సూపర్ వైజర్ నర్సయ్య, మోహన్ రెడ్డి,గోపాల మిత్రులు బైర శ్రీనివాస్, గంగారాం ,కిషన్, దశరథం, రైతులు నరేష్, భూమయ్య,రవి,భూమరెడ్డి, నర్సయ్య, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.రైతులు ఇలాంటి శిబిరాలు గ్రామీణ పశుసంవర్ధక రంగానికి ఎంతో దోహదం చేస్తాయని సూదవేణి భూమయ్య అభిప్రాయపడ్డారు.______

