Friday, March 13, 2026

సంఘ భవనం మంజూరుకు మంత్రికి వినతి పత్రం అందజేత

నేటి సాక్షి, ధర్మారం (అక్టోబర్ 18) : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామంలోని కుమ్మర కుల సంఘ భవన మంజూరు కొరకు సంఘ నాయకులు మరియు శాలివాహన యూత్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కి సంఘ నాయకులు, యూత్ సభ్యులు ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం వారు మంత్రిని శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు ఆవునూరి ఆమురయ్య, లచ్చయ్య, తిరుపతి, ఎల్లయ్య యూత్ అధ్యక్షులు ఆవునూరి కిరణ్, ఉపాధ్యక్షులు అంజయ్య, క్యాషియర్ సాయికిరణ్, సలహాదారు హరీష్ సభ్యులు ప్రశాంత్, అజయ్, రాజ్ కుమార్, శ్రీకాంత్, నవీన్, మహేష్, వంశీ, అనిల్, మోదునూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News