- – బండికి కేంద్ర పదవి.. కార్యకర్తకు దక్కిన గౌరవం
- – ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయాలి
- – ఢిల్లీలో బండిని కలిసిన బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు
నేటి సాక్షి, కరీంనగర్: తమలాంటి కార్యకర్తలందరికీ బండి సంజయ్‌కుమార్ స్ఫూర్తి అని బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ కన్వీనర్ ప్రవీణ్ రావు పేర్కొన్నారు. హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో శుక్రవారం న్యూఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లోని బండి సంజయ్ కార్యాలయానికి ప్రవీణ్ కుమార్ వెళ్లి, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాతో సత్కరించారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు ఉన్నత పదవులు లభిస్తాయనడానికి బండి నిదర్శనమన్నారు. ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినప్పటికీ సంజయ్‌కుమార్ సామాన్య కార్యకర్తగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి ఎనలేని సేవలందించారని గుర్తు చేసుకున్నారు. బండి సంజయ్‌కు పదవి దక్కడం సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవమన్నారు. బండి సంజయ్ స్ఫూర్తితో ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేసి గ్రామగ్రామాన పార్టీని తిరుగులేని శక్తిగా రూపొందించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరేయాలని కోరారు.